భారత్‌ తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో కాన్వే, రచిన్ రవీంద్రకు చోటు

 భారత్‌ తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో కాన్వే, రచిన్ రవీంద్రకు చోటు

వెల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియాతో జరిగే రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. గతంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును వాళ్ల సొంతగడ్డపై ఓడించిన కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాదాపుగా కొనసాగించారు. అయితే స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు డెవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే, రచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్ర, వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లండెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధిస్తే తుది జట్టులో ఆడనున్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం కాగా, జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డఫీ కొత్తగా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఇండియాతో జరిగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా రెండు జట్లకు ఎంతో కీలకం కానుంది.
 
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్, విల్ యంగ్.