కుమమోటో: ఇండియా షట్లర్ లక్ష్యసేన్.. కుమమోటో మాస్టర్స్ జపాన్ సూపర్–500 టోర్నీలో బోణీ చేశాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ లక్ష్య 21–19, 21–18తో చి యు జెన్ (చైనీస్‌తైపీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–16, 24–22తో రాస్మస్ గిమ్కే (డెన్మార్)పై పోరాడి గెలిచాడు.
మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్–మనీషా 21–16, 14–21, 14–21తో నాలుగోసీడ్ యి హాంగ్ వీ–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మరో మ్యాచ్‌లో హరిహరన్–తానీషా క్రాస్టో 7–21, 9–21తో టాప్‌సీడ్ జియాంగ్ జెన్ బాంగ్–వీ యా జిన్ (చైనా) చేతిలో కంగుతిన్నారు.
