పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్

పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం గూడ్స్ రైల్ ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి గూడ్స్ వ్యాగిన్లు వచ్చే ప్రత్యేక లైను లో ఇంజిన్ మార్చుకునేందుకు వెళ్లిన క్రమంలో కూనారం గేట్ ఆర్ఓబీకి  సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

గూడ్స్ రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఎరువుల ను అన్​లోడ్ చేసి జగిత్యాల కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంజిన్​ను మార్చే సందర్భంలో అది డెడ్ లైన్ దాటి వెళ్లడంతో ఇంజిన్ అక్కడ ఉన్న మట్టిలోకి వెళ్లి పట్టాలు తప్పింది. ఈ సంఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.