కొండగట్టు చందనోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వానం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు చందనోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వానం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు, వెలుగు: ఈనెల 15 నుంచి 20 వరకు కొండగట్టులో జరిగే చందనోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏండ్ల తర్వాత నిర్వహిస్తున్న చందనోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, ఆఫీసర్లు వైభవంగా చేపట్టారు. 

ఈ క్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి హైదరాబాదులో ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఈవో అంజనా రెడ్డి, అర్చకులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.