ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాలికి గాయం..వేములవాడ పట్టణంలో చికిత్స

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాలికి గాయం..వేములవాడ పట్టణంలో చికిత్స

వేములవాడ, వెలుగు : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​కాలికి తీవ్ర గాయమైంది. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్​మండలం ఇప్పపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​తో కలిసి ఓ ప్రోగ్రామ్​లో సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం సందర్భంగా ఫ్లెక్సీకి అంటించే కెమికలత్​తో ఫ్లెక్సీ బాండ్​ఆది శ్రీనివాస్​కాలికి గుచ్చుకుంది. 

దీంతో కాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను వేములవాడ పట్టణంలోని డాక్టర్​ ఆనందరెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్​ చికిత్స అందించి, కాలిలో గుచ్చుకున్న ప్లెక్సీ బాండ్‌‌‌‌ను తొలగించారు. కెమికల్​తో కూడిన బాండ్ కావడంతో ఆది శ్రీనివాస్ గాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్​ ఆనందరెడ్డి సూచించారు.