ప్రముఖ నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్) వివిధ ఇంజినీరింగ్
విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జీఈటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మైనింగ్ విభాగాల్లో 143 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.
మొత్తం ఖాళీలు: 143.
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ 66, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 44, సివిల్ ఇంజినీరింగ్ 23, మైనింగ్ ఇంజినీరింగ్ 10.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ ఇంజినీరింగ్, సివిల్ లేదా సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బి.టెక్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ స్థాయిలో అన్ రిజర్వ్డ్/ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు 60 శాతం, ఎస్సీ/ ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: 2026, నవంబర్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 13.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.854, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలు రూ.354 చెల్లించాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2025 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మార్కుల వెయిటేజీ విధానం
అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో గేట్–-2025 పరీక్షలో సాధించిన మార్కులు/ స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇస్తారు.
గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూకి 20 మార్కులు కేటాయిస్తారు. ఈ రెండింటిలో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల (100 మార్కులకు) ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి తుది ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nlcindia.inను సందర్శించండి.
- వెలుగు, ఎడ్యుకేషన్
