దోహా: ఇండియా షూటర్ నీరజ్ కుమార్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో డబుల్ ధమాకా సాధించాడు. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా సాధించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో నీరజ్ 346.5 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో నీరజ్ 34వ షాట్‌లో 9.4 పాయింట్లకే పరిమితం కావడంతో తృటిలో సిల్వర్ మిస్సయింది.
దిమిత్రి పిమెనోవ్, ప్యాట్రిక్ జైనే (స్లొవేకియా, 362.8) ఒలింపిక్స్ కోటాతో పాటు గోల్డ్, సిల్వర్ నెగ్గారు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తొమర్ (323.7) ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. టీమ్ విభాగంలో నీరజ్–ఐశ్వరీ ప్రతాప్–అఖిల్ ష్యోరాన్ 1751 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. మెన్స్ ట్రాప్‌లో ఉదయ్‌వీర్ సింగ్, వివాన్ కపూర్ ఫైనల్ రేసులో ఉన్నారు.
