- నిర్మల్కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం
- ‘బాసర ట్రిపుల్ ఐటీ’ సమస్యలపై ఆరా
నిర్మల్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమై న, సురక్షితమైన తాగునీరు అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, క్యాంపస్‌లో నీటి సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరి పడా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
