రావల్పిండి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్భుతంగా పుంజుకుంది. ధనంజయ డిసిల్వ (167 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (117 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో.. 114/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 404/4 స్కోరు చేసింది.
కమింద్ మెండిస్ (58)తో మూడో వికెట్‌కు 90, కుశాల్‌తో నాలుగో వికెట్‌కు అజేయంగా 249 రన్స్ జోడించాడు. పాక్ స్కోరుకు లంక ఇంకా 30 రన్స్ దూరంలో ఉంది. మహ్మద్ అబ్బాస్, సకిబ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
