హైదరాబాద్, వెలుగు: ఎన్ఎండీసీ టీపీజీఎల్–2026 గోల్ఫ్ టోర్నీలో మైసా జట్టు ప్లేయర్ అభిషేక్ రెడ్డి కంకణాల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన పోటీల్లో 11వ హోల్‌పై ఒకే షాట్‌తో బంతిని హోల్లోకి పంపి హోల్ ఇన్ వన్ సాధించాడు. ఈ అద్భుత ఘనత టోర్నీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అభిషేక్ రాణించినా.. ఐరోకో లార్వెన్ అవెంజర్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మైసా జట్టు 2–4తో ఓటమిపాలైంది.
క్రీడలు, సాంకేతిక రంగం, హైపర్‌లోకల్ లాజిస్టిక్స్ తదితర రంగాల్లో విజయవంతమైన వ్యాపార వేత్తగా గుర్తింపు పొందిన అభిషేక్.. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ (కేఎస్‌జీ) యాజమానిగా బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జైరాజ్ స్టీలర్స్ 4–2తో జీఎంఆర్ ఎలిగాన్స్‌పై, ఎజైల్ వ్యాలీ వారియర్స్ 3.5–2.5తో హల్దీ ఫెయిర్వేస్పై, లండన్ రాయల్స్ 5–1తో జీఎన్ఐటీఎస్ లహరి లయన్స్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాయి.
