న్యూఢిల్లీ: సెమీకండక్టర్ సంస్థ క్వాల్కామ్ భారత్లో ఉద్యోగుల తొలగిస్తోంది. గత 2–3 వారాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో తొలివిడత తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన సుమారు 20 వేల మంది ఉద్యోగుల్లో 5–6 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే ఇండియాలో1,000 మందిపై వేటు పడవచ్చు. తొలిదశలో సీనియర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. తదుపరి ఢిల్లీ– ఎన్సీఆర్, చెన్నై కేంద్రాల్లోనూ తొలగింపులు మొదలయ్యే అవకాశం ఉంది.
