ఏఐ కంటెంట్ కు క్వాలిటీ టెస్టులు తక్కువే.. క్వాలిజీల్స్టడీ రిపోర్ట్వెల్లడి

ఏఐ కంటెంట్ కు క్వాలిటీ టెస్టులు తక్కువే.. క్వాలిజీల్స్టడీ రిపోర్ట్వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: కంపెనీలు పెద్ద ఎత్తున జెనరేటివ్​ఏఐని వాడుతున్నా.. అది ఇస్తున్న కంటెంట్​నాణ్యత, పక్షపాతం, కచ్చితత్వాన్ని పరిశీలించడం లేదని హైదరాబాద్​ సంస్థ క్వాలిజీల్‌, హెచ్​ఎఫ్​ఎస్​ రీసెర్చ్‌ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 

దీని ప్రకారం.. అమెరికాలోని 57 శాతం సంస్థలు జనరేటివ్‌ ఏఐ వాడుతున్నాయి. 36 శాతం సంస్థల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఏఐ వ్యవస్థలు ఉన్నాయి.  కేవలం 15 శాతం సంస్థలకే ఏఐ పరీక్షల కోసం ప్రత్యేక విధానాలు ఉన్నాయి. మరో 52 శాతం సంస్థలు సాధారణ సాఫ్ట్​వేర్‌ పరీక్షల పద్ధతులనే ఉపయోగిస్తున్నాయి. 

ఏఐ నాణ్యతకు ప్రత్యేకంగా బాధ్యత వహించే విభాగం 37 శాతం సంస్థల్లో లేదు. 88 శాతం సంస్థలు ఏఐ ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తున్నప్పటికీ, పక్షపాతం, సమానత్వం వంటి అంశాలను పరిశీలిస్తున్నవి 47 శాతమే. ఏఐ నిర్ణయాలకు కారణాలు వివరించగలిగే సామర్థ్యం 37 శాతం కంపెనీలకు మాత్రమే ఉందని రిపోర్ట్​ పేర్కొంది.