హైదరాబాద్ సిటీ, వెలుగు: వేసవిలో నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు నీటిని సేకరించే అవకాశాలపై జలమండలి దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం జలమండలి ఎండీ కె అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి గండిపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
జంట జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని నగరానికి అదనంగా ఎంతమేరకు తరలించవచ్చనే అంశంపై పరిశీలించారు. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలు, ఇప్పటికే ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో అనుసంధానం, నీటి తరలింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మహేష్‌కుమార్, సీఈఓ రాంబాబు పాల్గొన్నారు.
