హైదరాబాద్, వెలుగు: టెలికం, విద్యుత్, గ్యాస్ వంటి మౌలిక సదుపాయాల రంగాల్లో నెట్వర్క్ నిర్వహణను మరింత సమర్థంగా మార్చేందుకు సైయెంట్ సంస్థ 3– జీఐఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పలు దేశాల వినియోగదారులకు 3 జీఐఎస్ సాఫ్ట్వేర్ పరిష్కారాలను సైయెంట్ అందించనుంది. నెట్వర్క్ డేటా సేకరణతో పాటు దాన్ని కచ్చితంగా నిర్వహించడం, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్, అమలు, నిర్వహణ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. సైయెంట్కు నెట్వర్క్ డేటా నిర్వహణలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది.
