జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 14న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
తణికెళ్ల భరణి మాట్లాడుతూ ‘పిల్లలందరూ కలిసి చూసే ఓ మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. పిల్లల కోసం మంచి సందేశం ఇచ్చేలా దీన్ని తెరకెక్కించారు’ అని అన్నారు. ఇలాంటి బాలల సినిమాల్ని ప్రోత్సహించడం అందరి సామాజిక బాధ్యత అని దర్శకుడు నవీన్ దేశబోయిన చెప్పారు.
ఇదొక ఎమోషనల్ స్టోరీ అని నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి చెప్పారు. ఇలాంటి ఓ మంచి చిత్రంలో ట్యూన్స్, డైలాగ్స్, పాటలు రాసే అవకాశం రావడం తన అదృష్టం అని ప్రవీణ్ బొలిశెట్టి అన్నారు. నటులు ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్, సత్యం రాజేష్, మాస్టర్ జయంత్, బేబీ ఊహ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
