ప్రేమకథతో సరికొత్తగా..సిద్ధు జొన్నలగడ్డ మూవీ...

ప్రేమకథతో సరికొత్తగా..సిద్ధు జొన్నలగడ్డ మూవీ...

హీరో సిద్ధు జొన్నలగడ్డ మరో సరికొత్త ప్రేమకథా చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది పదో చిత్రం.  నయన్ సారిక హీరోయిన్‌‌‌‌.  దర్శకుడు సుకుమార్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఒకరైన మోహన్ బి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి  నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలు. 

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 

నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌‌‌‌ను అందజేశారు.  ఈ కొత్త తరహా ప్రేమకథా చిత్రంలో సిద్ధు చాలా కొత్తగా కనిపిస్తాడని మేకర్స్‌‌‌‌ తెలియజేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.