ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రోషన్ మేక కొత్త సినిమా 

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రోషన్ మేక కొత్త సినిమా 

విభిన్నమైన కథలు,  వైవిధ్యభరిత చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌‌‌‌గా సూపర్ హీరో సినిమా చేయబోతున్నారు. శ్రీకాంత్‌‌‌‌ కొడుకు రోషన్ మేక ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రేఖా పాండే హీరోయిన్‌‌‌‌. వినయ్ రాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ చేశామని, అత్యాధునిక సాంకేతికత, భారీ స్థాయి విజువల్స్‌‌‌‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా మేకర్స్‌‌‌‌ తెలియజేశారు. 

పి.జి. విందా సినిమాటోగ్రాఫర్ కాగా, హనుమాన్, మిరాయ్ చిత్రాలతో మెప్పించిన గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.