‘ఎవరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మాయలేడి’. ప్రశంకర్ దర్శకుడు. మధుమిత సర్కార్ హీరోయిన్. ఈనెల 13న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు శశికిరణ్ తిక్క, పి. మహేష్ బాబు అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా చేయడానికి మొదటి కారణం స్క్రిప్ట్ అయితే, రెండో కారణం దర్శకుడి ప్యాషన్.
టీమ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్‌లా వర్క్ చేశాం. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే అదే రోజు ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరణ దక్కుతుందని నమ్మాం. ఆ కంటెంట్‌నే నమ్ముకుని వస్తున్నాం’ అని చెప్పాడు.
తొలిచిత్రంలోనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు హీరోయిన్ మధుమిత సర్కార్ చెప్పింది. డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ ‘రాకేష్ గతంలో నిర్మించిన ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు లాంటి డిఫరెంట్ కంటెంట్‌కు కమర్షియల్ హంగులు జోడించినట్టుగా ‘మాయలేడి’ ఉంటుంది.
ఒక కొత్త తరహా లవ్ స్టోరీ ఉన్న ఎంటర్టైనర్ను థియేటర్స్‌లో చూడబోతున్నారు’ అని చెప్పాడు. నటి మధురిమ, లావణ్య, ఫైట్ మాస్టర్ అంజి, ఎడిటర్ రవితేజ గిరిజాల, డీవోపీ రాధాకృష్ణన్, రైటర్ బిందు, ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్, కో ప్రొడ్యూసర్ విజిత్ పాల్గొన్నారు.
