సర్వైవల్ డ్రామాతో డార్క్ చాక్లెట్ మూవీ..

సర్వైవల్ డ్రామాతో డార్క్ చాక్లెట్ మూవీ..

విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌‌‌‌లో శశాంక్ శ్రీవాస్తవ తెరకెక్కించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌‌‌‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ ‘వరుస పరాజయాల్లో ఉన్న యజ్ఞ అనే హీరో పాత్రను ఇందులో పోషించా. కాస్త పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ,  ఇష్టానుసారంగా బిహేవ్ చేసే క్యారెక్టర్. ఫిల్మ్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాన్‌‌‌‌ చేయడంతో అన్ని తానే అయ్యి ఓ సినిమా ప్లాన్ చేస్తాడు. కథ రాయడం స్టార్ట్ చేయగా పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. 

ఆ  కలలు ఏమిటి, అందులోకి వచ్చేదెవరు, తన బెస్ట్ ఫ్రెండ్, లవ్ ఇంట్రెస్ట్, బాబాయ్ క్యారెక్టర్‌‌‌‌తో తన జర్నీ ఎలా ఉంటుంది..? నిజంగా వాళ్లు ఉన్నారా, లేక కలలో కనిపించారా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. హీరోతో పాటు ఇతర క్యారెక్టర్లు చాలా కీలకం.  సినిమా చాప్టర్లుగా ఉంటుంది. 

ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా ఇలాంటి సినిమా ఎక్కడా, ఎప్పుడూ రాలేదని అన్నారు. ప్రధానంగా ఇదొక సర్వైవల్ డ్రామా.  డార్క్ కామెడీ, మ్యూజికల్, సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ జానర్స్‌‌‌‌ కూడా ఉంటాయి.  అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఒక కొత్త సినిమా తీశాం. ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను క్రియేట్ చేశాం’ అని చెప్పాడు.