ఇట్లు అర్జున మూవీలో  ఎమోషన్‌‌‌‌ ను ఆడియన్స్ ఫీల్ అవుతారు: హీరో అనీష్ 

ఇట్లు అర్జున మూవీలో  ఎమోషన్‌‌‌‌ ను ఆడియన్స్ ఫీల్ అవుతారు: హీరో అనీష్ 

నాగార్జున సమర్పకుడి వ్యవహరించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల  తెరకెక్కించగా వెంకీ కుడుముల నిర్మించారు.  నవంబర్ 13న సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా హీరో అనీష్  సినిమా విశేషాల గురించి వివరిస్తూ ‘‘ఇదొక మూగవాడి ప్రేమకథ. మనసులోని భావాలను  మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనేది చాలా నచ్చింది. నా తొలి సినిమాకే ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో హీరోహీరోయిన్ల జర్నీతో పాటు యాక్షన్‌‌‌‌, ఎమోషన్‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌గా కుదిరాయి.  దీనికోసం దాదాపు ఆరు నెలలు వర్క్‌‌‌‌షాప్ చేశాం. 

ఇందులో యాక్షన్‌‌‌‌ను చాలా కొత్తగా డీల్ చేశాం. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ యాక్షన్‌‌‌‌లా కాకుండా హీరో  పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఉంటాయి. ఇందులో హీరోది చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఆ ఎమోషన్‌‌‌‌ను ఆడియన్స్ ఫీల్ అవుతారు. మూగవాడి పాత్రకు కొన్ని సీన్స్‌‌‌‌లో రియాక్ట్ అవ్వడం ఛాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. మాటలతో కాకుండా ఎక్స్‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌తోనే స్పందించడం కొంత కష్టం. అలాగే లిప్ సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా. 

కాన్సెప్ట్‌‌‌‌, కంటెంట్‌‌‌‌ నచ్చి ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ మా సినిమాను సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది.  అదే సమయంలో ఇది నా మీద మరింత బాధ్యతను పెంచింది. అలాగే నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు కూడా సినిమాను గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. 

ఇక భవిష్యత్తులో చక్కని ఎమోషన్‌‌‌‌ ఉన్న సినిమాలు చేయాలని ఉంది.  ఇప్పటికే రెండు, మూడు కథలు విన్నాను. బలంగా నచ్చి, నాకు సరిపోయే కథతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను” అని చెప్పాడు.