బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ చిత్రం ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదలైంది. ఆదిత్య దత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటించగా అపర్శక్తి ఖురానా కీలక పాత్ర పోషించారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే భారీ యాక్షన్ సన్నివేశాలు, రొమాన్స్, రక్తపాతంతో హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
తన గతాన్ని దాచుకుని ప్రేమను కాపాడుకోవడానికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే పాత్రలో ఇమ్రాన్ హష్మీ ఆకట్టుకున్నాడు. గన్ ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, మాస్ డైలాగ్‌లతో తన పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది. హిమేష్ రేష్మియా ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపక్ ముకుట్, హునార్ ముకుట్, సంగీత అహిర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 27న థియేటర్స్‌కు వస్తోంది.
