అల్లు అర్జున్, పూజా హెగ్డేలది ఎంతటి హిట్ కాంబినేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ ఆకట్టుకోగా, ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో వీళ్లిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ లక్కీ జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 23వ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్.
లోకేష్ కనగరాజ్ తీసిన ‘కూలీ’లో మోనిక అనే స్పెషల్ సాంగ్‌లో పూజాహెగ్డే నటించిన విషయం తెలిసిందే. గత చిత్రాల్లో బన్నీ-పూజాల మధ్య కుదిరిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు, ‘కూలీ’లో స్పెషల్ సాంగ్ చేయడం కూడా పూజాహెగ్డే ఎంపికకు ఓ కారణం అయ్యి ఉండొచ్చు.
ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ ఖరారైతే అల్లు అర్జున్ సరసన పూజకు ఇది హ్యాట్రిక్ చిత్రం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. అది పూర్తయ్యాక తన 23వ సినిమాపై దృష్టి సారించనున్నాడు.
