బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతీస్థాయిలో.. మాఫియా రాజ్యం : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపణ 

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతీస్థాయిలో.. మాఫియా రాజ్యం : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపణ 

పట్నా: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియా శక్తులు చెలరేగిపోయేలా చేస్తోందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేడీ నాయకుడు, అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుత పాలనలో రాష్ట్రం ఆర్థిక వినాశనానికి, పరిపాలనా వైఫల్యానికి వేదికగా మారిందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అవినీతి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు, దిగజారిన పాలన వ్యవస్థాగత సమస్యలుగా మారాయని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో ప్రతీ స్థాయిలో మాఫియా రాజ్యం నడుస్తోంది. నేరస్తులు పోలీసులను చంపుతుంటే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు అమాయక పౌరులను బలి తీసుకుంటున్నారు. అంతకంటే దురదృష్టకరం మరొకటి ఉందా?’’ అని నిలదీశారు. 

సీఎం సమ్రాట్ చౌదరిపై కూడా తేజస్వీ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆయనకు పాలనా అనుభవం లేకపోవడం వల్లే పోలీసు యంత్రాంగం, బ్యూరోక్రసీ జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. సీనియర్ అధికారులు కూడా సీఎంను సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవడం లేదని, ప్రజారోగ్యం, ఉపాధి, నాణ్యమైన విద్య, శాంతిభద్రతలు ఆయన ప్రాధాన్యతల్లోనే లేవని ఫైర్ అయ్యారు.

ఎన్డీయే పాలనలో పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన పూర్తిగా మూలనపడ్డాయని విమర్శించారు. అవినీతి హద్దులు దాటి పాలన కుప్పకూలిందని పేర్కొన్నారు. ఓట్ల చోరీ ద్వారా అధికారంలోకి వచ్చిన వారు, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాశనం చేయడానికే ఒక నామినేటెడ్ సీఎంకు రాష్ట్రాన్ని అప్పగించారా? అని తేజస్వీ యాదవ్​ ప్రశ్నించారు.