సునేత్రకు ఎమ్మెల్యేల షాక్ తప్పదు.. ఎంపీ సంజయ్ రౌత్

సునేత్రకు ఎమ్మెల్యేల షాక్ తప్పదు.. ఎంపీ సంజయ్ రౌత్

ముంబై: సునేత్రా పవార్ నాయకత్వంలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీకి ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడం ఖాయమని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆ పార్టీకి చెందిన 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీ మారే అవకాశముందని చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీ ఎమ్మెల్యేలు వరుసగా భేటీ కావడం వెనుక పెద్ద రాజకీయ కథే ఉందని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మరణం తర్వాత బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీ ఎమ్మెల్యేలు బానిసల్లా మారిపోయారని రౌత్ విమర్శించారు. 

ఎమ్మెల్యేలు శరద్ పవార్ వర్గంలోకి వెళ్తే దాన్ని విలీనం అనలేమని, లేదంటే ఎన్నికల ముందు మరో పార్టీలోకి వెళ్లే అవకాశమూ ఉందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ అనుమతి లేకుండా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీ విలీనం జరగదని సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపైనా రౌత్ స్పందించారు.

ఈ నిబంధన శరద్ పవార్ పార్టీకి వర్తించదని అన్నారు. ఇక కొల్హాపూర్ గోకుల్ డెయిరీ ఎన్నికల వ్యవహారంపైనా ప్రభుత్వంపై రౌత్​ మండిపడ్డారు. ప్రభుత్వం తన ఓటింగ్ అధికారాన్ని ఉపయోగించి నలుగురు అదనపు డైరెక్టర్లను నామినేట్ చేయడం వల్లే మహాయుతి అభ్యర్థి రాజేశ్ పాటిల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గెలిచారని ఆరోపించారు.