జమ్మూలో  మిస్సింగ్ SPOల దారుణ హత్య.. బుల్లెట్లతో ఛిద్రమైన డెడ్ బాడీలు 

జమ్మూలో  మిస్సింగ్ SPOల దారుణ హత్య.. బుల్లెట్లతో ఛిద్రమైన డెడ్ బాడీలు 

జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ, పోలీసు సిబ్బందిపై వరుస దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  బుధవారం కుల్గాం జిల్లాలో సెక్యూరిటీ పోస్టుపై  దుండగుల దాడి జరిగినకొద్ది గంటల్లోనే జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీసు అధికారులు అదృశ్యమయ్యారు. ఇద్దరు అధికారులు దారుణంగా హత్య గురయ్యారు. వారి శరీరాలు బుల్లెట్లతో ఛిద్రమైన ఉన్నట్లు  అధికారులు గుర్తించారు. గస్తీకి వెళ్లిన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPO) లు  మృతిచెందడం భద్రతా పరమైన ఆందోళన రేకెత్తించాయి. 

పోలీసు అధికారుల ప్రకారం..జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (SPOలు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన సిబ్బందిని బాబీ చంద్ (57), రష్పాల్ కుమార్ (45) గా గుర్తించారు. వీరిద్దరూ స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో దాచన్‌లోని కియార్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి మృతదేహాలు బుల్లెట్లతో ఛిద్రమైన ఉన్నట్లు గుర్తించారు.  శిబిరం నుంచి ధర్నా-మార్వాలోని ఆర్మీ పోస్టుకు వెళ్తుండగా ఇద్దరు ఎస్‌పిఓలు అదృశ్యమయ్యారు. వారి సర్వీస్ ఆయుధాలు కనిపించకుండా పోయాయని, దీని వెనుక ఉగ్రవాద కోణం ఉండవచ్చనే అనుమానిస్తున్నారు. కుల్గాం జిల్లాలో భద్రతా సిబ్బందిపై జరిగిన దాడి తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతాఆందోళన లేవనెత్తింది