IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2028 సీజన్‌కు ముందు టోర్నమెంట్‌ను 12 జట్లకు విస్తరించనున్నారంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టతనిచ్చింది. పూణే, వడోదర జట్లు ఐపీఎల్‌లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు:
* అధికారికంగా ఎలాంటి చర్చ జరగలేదు: ఐపీఎల్ 2028లో 12 జట్ల టోర్నమెంట్‌గా మారే అవకాశంపై మేము అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఎప్పుడూ చర్చించలేదు.. ప్రస్తుతానికి ఈ అంశం మా పరిధిలో లేదన్నాడు.
* 20వ ఎడిషన్‌పైనే మా దృష్టి: ప్రస్తుతం మేము ఐపీఎల్ 2027 గురించే ఆలోచిస్తున్నాం.. ఇది ఐపీఎల్‌కు 20వ ఎడిషన్ కావడంతో చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆ వేడుకలపైనే మా ఫోకస్ ఉంది తప్ప, ఆ తర్వాత జరిగే విషయాలపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
* అవన్నీ ఊహాగానాలే: మీడియాలో వస్తున్న వార్తలన్నీ కొన్ని సృజనాత్మక మెదళ్ల నుంచి పుట్టుకొచ్చిన ఊహాగానాలు మాత్రమే.. వాటిలో ఎలాంటి నిజం లేదని సైకియా పేర్కొన్నారు.
శాలరీ పర్స్, డిసెంబర్ 16 ఆక్షన్:
2028 మెగా ఆక్షన్‌కు ముందు శాలరీ పర్స్ (Salary Purse) పెంచే అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ప్రస్తుత సైకిల్‌లో చివరి సంవత్సరమైన ఐపీఎల్ మినీ ఆక్షన్ డిసెంబర్ 16వ తేదీన జరగనుందని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
జూహీ చావ్లా విజ్ఞప్తిపై రియాక్షన్:
ఐపీఎల్ షెడ్యూల్‌ను ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఎండల నుంచి మార్చి లేదా జనవరికి మార్చాలని కోరుతూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహ-యజమాని జూహీ చావ్లా చేసిన అభ్యర్థనపై దేవజిత్ సైకియా స్పందిస్తూ.. మేము కేవలం మార్చి 2027లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2027 నిర్వహణ గురించే ఆలోచిస్తున్నామని తేల్చి చెప్పారు.
