ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి అక్షర్ గుడ్‌బై? రంగంలోకి గంగూలీ, యువరాజ్!

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి అక్షర్ గుడ్‌బై? రంగంలోకి గంగూలీ, యువరాజ్!

Axar Patel: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీమ్ కెప్టెన్ అక్షర్ పటేల్ వచ్చే సీజన్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి తన వ్యక్తిగత ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందని భావిస్తున్న అక్షర్, జట్టు పగ్గాలు వదులుకోవాలని ఫిక్స్ కావడంతో, ఢిల్లీ ఫ్రాంచైజీ మాత్రం అతన్ని బుజ్జగించే పనిలో పడింది. 

అక్షర్ కెప్టెన్సీ వద్దనుకోవడానికి అసలు కారణం ఇదే: 

* జట్టు ప్రదర్శన: అక్షర్ పటేల్ ఇప్పటి వరకు రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. అయితే ఈ రెండు సార్లూ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

* వ్యక్తిగత ఫామ్‌పై ఎఫెక్ట్: కెప్టెన్సీ అదనపు భారం వల్ల అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ముఖ్యంగా IPL 2026 లో 14 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ కేవలం 173 రన్స్ చేసి, 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఆటపై పూర్తి ఫోకస్ పెట్టేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేశాడు.

ట్రేడ్ ఆఫర్లను తిరస్కరించిన ఢిల్లీ: 

అక్షర్ పటేల్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఢిల్లీ క్యాపిటల్స్‌ను సంప్రదించి భారీ ఆఫర్లు ఇచ్చాయి. కానీ, ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఆ ట్రేడ్ ఆఫర్లన్నింటినీ తిరస్కరించింది. అక్షర్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని యజమానులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వేలం ముగిసే వరకు కొత్త కెప్టెన్ పేరును ప్రకటించే ఉద్దేశంలో లేమని స్పష్టం చేసింది. 

కొత్త కోచింగ్ స్టాఫ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్: 

* ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ విభాగంలో సంచలన మార్పులు చేసింది. ఈ క్రమంలో హెడ్ కోచ్, సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ కోచ్ యువరాజ్ ఇద్దరు కలిసి అక్షర్ పటేల్ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగమని ఆడగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

* హెడ్ కోచ్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

* అసిస్టెంట్ కోచ్: మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్

* సపోర్ట్ స్టాఫ్: చమిందా వాస్, అమిత్ మిశ్రా వంటి దిగ్గజ ఆటగాళ్లు కోచింగ్ బృందంలో చేరారు.