ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్ సన్ హువాంగ్ వ్యక్తిగత వివాదాల కారణాలతో పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నందున, ఆయన స్థానంలోకి ఎవరు వస్తారనే అంశంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు దశాబ్దాలుగా కంపెనీనీ విజయవంతంగా నడిపించిన హువాంగ్ స్థానాన్ని ఎవరు సమర్థవంతంగా భర్తీ చేస్తారనేది చర్చనీయాంశమైంది. హువాంగ్ తర్వాత ఎన్విడియాను సక్సెస్ ఫుల్ గా నడిపించే వారసులుగా ప్రధానంగా ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఇయాన్ బక్, కొలెట్ క్రెస్, మాడిసన్ హువాంగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కంపెనీకి అధికారిక వారసత్వ ప్రణాళిక లేనప్పటికీ, లీడర్ షిప్ క్వాలిటీస్, కంపెనీ విశ్లేషణల ఆధారంగా ఈ ముగ్గురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇయాన్ బక్..
ఎన్విడియాలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీరింగ్. ప్రస్తుతం హైపర్‌స్కేల్ ,డేటా సెంటర్ కంప్యూటింగ్ విభాగాలకు హెడ్ గా ఉన్నారు. ఎన్విడియా ఏఐ (AI) ఆధిపత్యానికి కీలకమైన CUDA సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం డెవలపింగ్ లో ఈయనది కీరోల్. సాంకేతిక పరిజ్ఞానం, పెద్ద క్లౌడ్ కస్టమర్లతో ఉన్న సంబంధాల దృష్ట్యా బక్ కు ఎన్విడియా సీఈవో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొలెట్ క్రెస్..
2013 నుంచి ఎన్విడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) గా పనిచేస్తున్నారు కొలెట్ క్రెస్. వాల్ స్ట్రీట్ ,ఇన్వెస్టర్లకు సుపరిచితమైన వ్యక్తి ఆమె. జెన్ సన్ హువాంగ్ తర్వాత కంపెనీ ఆర్థిక ,వ్యాపార వ్యవహారాలపై పూర్తి పట్టున్న లీడర్ ఆమె. ఒకవేళ హువాంగ్ తక్షణమే వైదొలిగితే, తాత్కాలిక సీఈఓ (Interim CEO) బాధ్యతలు చేపట్టడానికి ఈమెకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మాడిసన్ హువాంగ్ ..
ఎన్విడియా సీఈవో రేసులో ఉన్న మరో వ్యక్తి.. మాడిసన్ హువాంగ్.. ప్రస్తుత సీఈవో జెన్సన్ హువాంగ్ కుమార్తె. ప్రస్తుతం ఎన్విడియాలో ఫిజికల్ ఏఐ విభాగానికి సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెటింగ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా కంపెనీ వ్యాపార కార్యకలాపాల్లో ఈమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ సమర్థవంతంగా నిర్వర్తించే సామర్థ్యం మాడిసన్ కు ఉన్నప్పటికీ కంపెనీ రూల్స్ ప్రకారం.. కుటుంబ వారసత్వం, బోర్డు సభ్యులనుంచి ఆమె ప్రతికూలత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. వీరితోపాటు బయటి వ్యక్తుల పేర్లను కూడా ఎన్విడియా బోర్డు పరిశీలిస్తున్నట్లు Bloomberg నివేదికలు సూచిస్తున్నాయి.
