నాగర్ కర్నూల్ జిల్లాలో మెరుపు దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గురువారం ( నవంబర్ 11 ) నిర్వహించిన ఈ సోదాలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సత్యనారాయణ ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో 10 బృందాలతో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ మాధవరం ఎంక్లేవ్ లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ సోదాల్లో సత్యనారాయణ ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సోదాలు ముగిసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు.
