టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. శంషాబాద్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడుతో ఉన్న వాహనం శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనప్పటికీ, కారులో ఉన్న మిగతా వారంతా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శేఖర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
అసలేం జరిగింది?
బుధవారం (నవంబర్ 11, 2026న) రాత్రి మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా కోసం పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శంషాబాద్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడుతో ఉన్న లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు వెనుక భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే, కారులో ఉన్న మిగతా వారంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మేడోయాలో వైరల్ అవుతున్నాయి.
💥💥బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥 టాలీవుడ్ #Choreographer శేఖర్ మాస్టర్ కారు కూ ప్రమాదం జరిగినట్టు సమాచారం.. మెగాస్టార్ #Chiranjeevi #KAAKA సాంగ్ షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న పండ్ల లారీ నీ శేఖర్ మాస్టర్ కారు ఢీ కొట్టినట్టు సమాచారం.. ఈ ప్రమాదం పై కాసేపట్లో రానున్న క్లారిటీ ..? #Shekarmaster #Accident
— Kakinada Talkies (@Kkdtalkies) November 12, 2026
శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలు
ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ వార్త సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వ్యాపించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పిందన్న విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చిరంజీవి ‘కాకా’ సినిమా షూటింగ్‌లో..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కు కోరీయోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా నవంబర్ 6నే శేఖర్ మాస్టర్ పుట్టినరోజును ‘కాకా’ సెట్లో చిత్రబృందం జరుపుకున్నారు
Happy Birthday to the ever-energetic @Sekharmasteroff garu! 🎉❤️ Keep spreading your positivity and rocking with your incredible energy. Wishing you a fantastic year ahead! #HBDSekharMaster https://t.co/0rPVWfiEdQ
— Bobby (@dirbobby) November 6, 2026
