తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం కుటుంబసమేతంగా వెళ్లిన ఓ భక్తుడు ఆకస్మికంగా మృతి చెందాడు. గురువారం ( నవంబర్ 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన నాగునాయక్ అనే భక్తుడు తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తిరుమలలో ఉండగా నాగునాయక్ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అయితే నాగునాయక్ అప్పటికే మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన నాగునాయక్ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే.. నగునాయక్ మృతికి గల అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది.
