కస్టడీలోకి 9 మంది ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు.. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విచారణ

 కస్టడీలోకి 9 మంది ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు.. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విచారణ

ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకుల వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. పిల్లలు లేని వారి  సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుని అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్న వారిపై చర్యలు ఏమయ్యాయని పోలీసులను ప్రశ్నించింది. దీంతో విచారణలో దూకుడు పెంచిన పోలీసులు..  2026 నవంబర్ 12న 9 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. 
 
బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకులను విచారిస్తున్నారు.  బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో గోప్యంగా ఉంచి  దర్యాప్తు చేస్తున్నారు. మహిళా కమిషన్ ఆదేశాలతో ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.