యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని ఆలయ ఈఓ భవాని శంకర్ పరిశీలించారు. సత్యనారాయణ స్వామి వ్రతల నిర్వహణ తీరును భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు,వ్రత మండపంలో సీసీ కెమెరాల పని తీరును ఆరా తీశారు.
సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహణకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్రత సామాగ్రి ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ వ్రత నిర్వహణ చేసుకునే భక్తులకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓ తో పాటు డీఈవో భాస్కర్ శర్మ,ఎస్పీఎఫ్ సీఎస్వో శేషగిరిరావు,సూపరింటెండెంట్ శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.
