కుర్రాళ్లు కుమ్మేశారు.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా

కుర్రాళ్లు కుమ్మేశారు.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా

అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా కుర్రాళ్లు.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్య రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చందానీ (90 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 93), ఆర్యవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెహ్వాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (57 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 51), వీకే వినీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (62 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 57 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 227/8 స్కోరు చేసింది. నోమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (51), షా ఫైజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (51) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించారు. 

సుభాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31), సోహైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (36 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. ఇండియా బౌలర్లలో ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, ఆర్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవ్సాని 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 36.5 ఓవర్లలో 230/2 స్కోరు చేసి నెగ్గింది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్లు లక్ష్య, ఆర్యవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 117 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. వేగంగా ఆడే క్రమంలో ఆర్యవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటైనా.. వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన వినీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. లక్ష్యతో కలిసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేశాడు. చివర్లో యశవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, సోహైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. లక్ష్యకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. శనివారం జరిగే ఫైనల్లో ఇండియా.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.