టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. కివీస్ జట్టులో ఏకంగా 6 మార్పులు

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. కివీస్ జట్టులో ఏకంగా 6 మార్పులు

India vs New Zealand: మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా తాత్కాలిక కొత్త వన్డే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సొంతగడ్డపై సిరీస్ కాపాడుకోవాలని చూస్తున్న న్యూజిలాండ్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. మరోవైపు, ఇండియన్ టీమ్ లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఛేజింగ్ చేయడం మాకు ఇష్టం.. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోంది. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడం ముఖ్యం.. మేము ఈ మ్యాచ్‌ను ఒక నాకౌట్ మ్యాచ్‌లా భావిస్తున్నాం.. మా జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లని తుది జట్టులోకి తీసుకొచ్చామని శ్రేయస్ పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. క్రికెట్‌కు ఇది అద్భుతమైన రోజులా కనిపిస్తోంది. పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ ఉండే అవకాశం ఉంది, అలాగే కాస్త పొడిగా కూడా కనిపిస్తోంది. మా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇవాళ ఆరు మార్పులు చేశాం.. కొత్త కుర్రాళ్లకు అవకాశం రావడం మంచి విషయమే.. ప్రస్తుత పరిస్థితుల్లో మేము చేయాల్సిన మార్పుల్లో ఇది భాగం అని శాంట్నర్ వెల్లడించాడు. 

ఇరు జట్లు: 

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, మాథ్యూ ఫిషర్

భారత్: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అఖిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్