జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • 14 నుంచి జిల్లా సదస్సులు
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ తో వచ్చే నెల14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీల జనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వేలాది మందిని కదిలించడానికి ఈనెల 14 నుంచి వచ్చే నెల 5వరకు రంగారెడ్డి నుంచి సంగారెడ్డి వరకు జిల్లా పర్యటనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 

గురువారం హైదరాబాద్ బీసీ భవన్ లో జాజుల మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న రంగారెడ్డి జిల్లా తాండూరులో, 16న భద్రాది కొత్తగూడెంలో, 21న మెదక్ జిల్లాలో, 22న అచ్చంపేటలో, 26న కరీంనగర్ లో, 28న నిర్మల్,  మంచిర్యాలలో, 29న మహబూబ్​నగర్ లో, 30న నిజామాబాద్, 2 న నల్గొండ, 5న సంగారెడ్డిలో ఓబీసీ గణన జిల్లా సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓబీసీ కాలం చేర్చకుంటే దేశవ్యాప్తంగా 60 శాతం ఉన్న ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కే పరిస్థితి ఉండదన్నారు. 

భారత్ సమిట్ లో పాల్గొనడానికి రాష్ట్రానికి రానున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఓబీసీ కులగణనపై జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని జాజుల విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30 నుంచి ఢిల్లీలో జరిగే పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.