వాలీబాల్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ అదుర్స్.. 5–0తో గెలుపు 

వాలీబాల్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ అదుర్స్.. 5–0తో గెలుపు 

విజయవాడ: కంకణాల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్వాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో.. ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తెలుగు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5–0 (25–11, 25–14, 25–9, 15–5, 16–14)తో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీ జట్టుపై నెగ్గింది. ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం చూపెట్టిన తెలుగు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రతి సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ జోరును కొనసాగించింది. 

ఈ ట్రయల్స్ ద్వారా సిరిల్ రెడ్డి (వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు (యానం), నమిత్, మునీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటేశన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పీవీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5 తెలుగు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టులో చోటు సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీసి యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన లక్ష్యమని (కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంకణాల అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపాడు.