అసలు సమరానికి వేళాయె.. శనివారమే భారత్ vs పాక్ ఫైనల్.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!

అసలు సమరానికి వేళాయె.. శనివారమే భారత్ vs పాక్ ఫైనల్.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!

IND vs PAK U19 Final: ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2026, నవంబర్ 14 (శనివారం) ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ హై-వోల్టేజ్ ఫైనల్ ఫైట్ జరగనుంది. గ్రూప్ దశలో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని, ట్రోఫీని ముద్దాడాలని ఇండియన్ కుర్రాళ్లు పట్టుదలగా ఉన్నారు. 

ఫైనల్‌కు ఇరు జట్ల ప్రయాణం సాగిందిలా:

భారత్ జోరు: రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్ (హాఫ్ సెంచరీ) రాణించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.

పాకిస్థాన్ దూకుడు: తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన పాకిస్థాన్.. ఆ తర్వాత 9 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఫిక్స్ చేసుకుంది. 

►ALSO READ | ఆఫ్ఘనిస్థాన్‌ని చిత్తుగా ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో అమీతుమీకి రెడీ!

నవంబర్ 8 ఓటమికి బదులు తీర్చుకునే ఛాన్స్:

ఈ టోర్నీలో గ్రూప్-ఏలో భాగంగా నవంబర్ 8వ తేదీన జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోటీ పడ్డాయి. ఆ ఉత్కంఠభరిత పోరులో హంజా జహూర్ అజేయ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఇండియాపై విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.

ఫైనల్ మ్యాచ్ పూర్తి వివరాలు:

 

వివరాలు                                   సమాచారం
మ్యాచ్       భారత్ U19 vs పాకిస్థాన్ U19 (ఫైనల్)
తేదీ                నవంబర్ 14, 2026 (శనివారం)
సమయం                ఉదయం 10:30 గంటలకు (IST)
వేదిక             అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్, ఒమన్
గ్రూప్ దశ ఫలితం                   పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపు