వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే సినీ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ వారం పండగే అని చెప్పొచ్చు. ఒకటి కాదు.. ఏకంగా 9 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఒకే రోజు అంటే నవంబర్ 13, శుక్రవారం నుంచి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన చారిత్రక నేపథ్య చిత్రం నుంచి కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వరకు ఈ జాబితాలో ఎన్నో స్పెషల్ మూవీస్ ఉన్నాయి. మిస్సింగ్ కేసులు, వరుస హత్యలు, బ్యాంక్ దోపిడీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కంటెంట్ అందుబాటులోకి రానుంది. మరి ఆ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటి? వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్స్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి? పూర్తి వివరాలు చూద్దాం.
రణబాలి – నెట్‌ఫ్లిక్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న దారుణాలు, అణచివేత, సామూహిక మరణాల వంటి చారిత్రక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే తిరుగుబాటుదారుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక ఆయన భార్యగా నటించింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించారు.
Idhi Ranabaali Veeragadha 🏇 https://t.co/QGZm5Qeazd
— Netflix India South (@Netflix_INSouth) November 11, 2026
హ్యాపీ జర్నీ – సన్ నెక్స్ట్
వీకెండ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఓ సినిమా చూడాలనుకునేవారికి ‘హ్యాపీ జర్నీ’ మంచి ఆప్షన్ కానుంది. ఆమని, జినిషా అలిశెట్టి, అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునయన, రూప శ్రీనివాస్, రవి శివతేజ, వంశీధర్ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. విభిన్న వయసులకు చెందిన మహిళలు, వారి జీవితాలు, అనుబంధాలు, అనుకోని పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది.
కథాంశం: సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని) సహా ఏడుగురు మహిళలకు లక్కీ డ్రాలో ఉచితంగా యూరప్ వెళ్లే అవకాశం వస్తుంది. సరదాగా మొదలైన ఈ ప్రయాణంలో వారి జీవితాల్లోని సమస్యలు, కుటుంబ బంధాలు, అనుబంధాలు తెరపైకి వస్తాయి. ఈ జర్నీతో విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయి? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ.
Mark your calendar! A Complete Family Entertainer #HappyJourney streaming on Sun NXT from 13 NOV. #SunNXT #SunNXTNewReleases #HappyJourneyOnSunNXT #TeluguMovie https://t.co/WZht5K25gy
— SUN NXT (@sunnxt) November 10, 2026
దాయిరా (Daayra) – నెట్‌ఫ్లిక్స్
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘దాయిరా’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు రేపు నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కరీనా, పృథ్వీరాజ్ ఇద్దరూ పోలీస్ ఉన్నతాధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. ‘రాజీ’, ‘తల్వార్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మేఘనా గుల్జార్ మరోసారి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో న్యాయం, చట్టం, నైతిక విలువల మధ్య సంఘర్షణను తెరపైకి తీసుకొచ్చారు.
►ALSO READ | GOAT Movie Review: సుడిగాలి సుధీర్ ఖాతాలో హిట్ పడినట్టేనా?
కథాంశం: 2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నేరస్థులకు తక్షణ శిక్ష విధించాలనే ప్రజల ఆకాంక్షకు, చట్టపరమైన న్యాయానికి మధ్య జరిగే సంఘర్షణను ఇందులో చూపించారు. పోలీసుల దర్యాప్తు, నిర్ణయాలు, న్యాయం చుట్టూ సాగే ఈ కథ ఉత్కంఠను పంచుతుంది.
Sathyam purathu varumo, atho system athine moodivekkumo? ⚖️ https://t.co/kllW4Ww2Ma
— Netflix India South (@Netflix_INSouth) November 12, 2026
బాంద్రా (Bandra) – జీ5
తమన్నా భాటియా, దిలీప్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ డ్రామా ‘బాంద్రా’ మరోసారి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ డ్రామా, గ్యాంగ్‌స్టర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా 1990ల నాటి బాలీవుడ్ సినిమా ప్రపంచం, అండర్‌వరల్డ్ సంబంధాలు, ఓ మహిళ జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
కథాంశం:1990ల బాలీవుడ్ నటి తార జానకి (తమన్నా) వేధింపుల నుంచి తప్పించుకుని కేరళలో అలెగ్జాండర్ డొమినిక్ (దిలీప్) కుటుంబం వద్ద ఆశ్రయం పొందుతుంది. అయితే ఆమెను వెతుక్కుంటూ కొందరు రావడంతో కథ మళ్లీ ముంబైకి చేరుతుంది. అక్కడ ప్రేమ, ప్రతీకారం, గ్యాంగ్‌స్టర్‌లతో ముడిపడిన సంఘటనలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథ.
#Bandra (Malayalam) Streaming from November 13 on Zee5 🍿!! #OTT_Trackers https://t.co/PYf1buL0iD
— OTT Trackers (@OTT_Trackers) November 5, 2026
ది థర్డ్ మర్డర్ (The Third Murder)..
వరుస హత్యలు.. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న నేరాలు.. వాటి వెనుక దాగున్న అసలు వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మలయాళ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ది థర్డ్ మర్డర్’. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
కథాంశం: ఓ వ్యాపారవేత్త, డ్రగ్ పెడ్లర్ హత్యకు గురవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఒకే తరహాలో జరిగిన ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? వాటి మధ్య సంబంధం ఏమిటి? అనే కోణంలో విచారణ సాగుతుంది. హంతకుడి ఆలోచనలు, పోలీసుల వ్యూహాలు, ఊహించని మలుపులతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
#TheThirdmurder (2026) | Malayalam Streaming on Manoramax From November 13… Audio: Malayalam only https://t.co/G0WMb2ZfvD
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) November 10, 2026
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’. సాధారణంగా కాలేజ్ లైఫ్, స్నేహాలు, ప్రేమకథలతో ముడిపడిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరుకు భిన్నంగా ఈసారి డార్క్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో సిరీస్‌ను రూపొందించినట్లు సమాచారం. నవంబర్ 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. టైటిల్‌లోని ‘ఆఫ్టర్ డార్క్’ అనే పదమే ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
కథాంశం: విద్యార్థుల ప్రపంచం, కాలేజ్ లైఫ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో క్రైమ్, రహస్యాలు, చీకటి కోణాలను ప్రధానంగా చూపించనున్నారు. స్నేహాలు, ప్రేమలు, వ్యక్తిగత ఆశయాల వెనుక దాగున్న సంఘర్షణలు, అనూహ్య పరిణామాలతో ఈ డార్క్ థ్రిల్లర్ సాగనుంది.
Picture-perfect gang, not-so-perfect secrets! Hotstar Specials: Student Of The Year - After Dark, streaming from 13th November, only on JioHotstar. #SOTYAfterDarkOnJioHotstar @shanayakapoor #ManyaGrover #DivikSharma #AdiMalik #AbhinavSingg #Deeyadamini #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @somenmishra0 #ReemaMaya #DebashishIrengbam @Dharmatic_ @sonymusicindia
— JioHotstar (@JioHotstar) November 10, 2026
హార్ట్‌ల్యాండ్ (Heartland)
ఓ యువతి మిస్సింగ్.. ఆమె ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ఓ మాజీ కంట్రీ మ్యూజిక్ స్టార్.. ఈ అన్వేషణలో బయటపడే ఊహించని రహస్యాలు.. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ‘హార్ట్‌ల్యాండ్’ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జెస్సికా చస్టెయిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి షనా ఫెస్టే దర్శకత్వం వహించారు. గారెట్ హెడ్లండ్, కార్టర్ ఫెయిత్, రాస్ లించ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథాంశం: నాష్‌విల్లే సంగీత ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ కథలో ఒకప్పుడు పాపులర్ కంట్రీ సింగర్‌గా గుర్తింపు పొందిన మిస్టీ జోన్స్.. తన మేనకోడలు కనిపించకుండా పోవడంతో ఆమె కోసం అన్వేషణ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో గతానికి సంబంధించిన చేదు నిజాలు, సంగీత ప్రపంచంలోని చీకటి కోణాలు బయటపడతాయి. మిస్సింగ్ కేసు, మిస్టరీ, కుటుంబ అనుబంధాలు కలగలిసిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకోనుంది.
#Heartland (English) Streaming From NOV 13 on @NetflixIndia in English, Tamil, Telugu & Hindi #OTT_AD_SQUAD https://t.co/lc0Ag8YKla
— OTT AD SQUAD (@OTT_AD_SQUAD) November 10, 2026
పారివారిక్ మనురంజన్..
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు కుటుంబ సమేతంగా చూసేందుకు ఓ లైట్ ఎంటర్‌టైనర్ కూడా ఈ వారం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘పారివారిక్ మనురంజన్’ నవంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమ, కామెడీ, కుటుంబ భావోద్వేగాల కలయికగా రూపొందింది.
కథాంశం: లక్నో నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ బ్యాచిలర్ జీవితంలోకి యువతి ప్రవేశించడంతో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. వారి పరిచయం, ప్రేమ, మధ్యలో ఎదురయ్యే సరదా సంఘటనలు, కుటుంబ అనుబంధాల చుట్టూ కథ వినోదాత్మకంగా సాగుతుంది.
#ParivarikManuRanjan (2026) | Hindi | Film | Direct to OTT Streaming on SonyLIV from November 13… Audio: Hindi only https://t.co/VHbDXxtrFd
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) November 10, 2026
మర్డర్ ఇన్ గలీసియా..
నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మినీ సిరీస్ ‘మర్డర్ ఇన్ గలీసియా’ కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. కేవలం మూడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రిస్టాన్ ఉల్లోవా, కార్లోస్ బ్లాంకో, ఫెర్ ఫ్రాగా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఓ మహిళపై జరిగిన దాడి, ఆమె భర్తపై వ్యక్తమైన అనుమానాలు, అసలు నేరస్థుడిని గుర్తించే క్రమంలో ఎదురయ్యే చిక్కులు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
కథాంశం: స్పెయిన్‌లోని పాజోస్ గ్రామంలో ఐరీన్ అనే మహిళపై ఓ రాత్రి దారుణమైన దాడి జరుగుతుంది. ఈ కేసులో ఆమె భర్త అనిసెటోపై పోలీసులకు అనుమానం కలుగుతుంది. అయితే దర్యాప్తులో బయటపడే కొత్త ఆధారాలు, అనుమానాలు కేసును మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. అసలు నేరస్థుడు ఎవరు? అనే ఉత్కంఠతో కథ సాగుతుంది.
మొత్తంగా చూస్తే.. నవంబర్ 13 వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు విభిన్నమైన వినోదాన్ని అందించనుంది. చారిత్రక కథలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు, హత్యల మిస్టరీలు, బ్యాంక్ దోపిడీలు, మిస్సింగ్ కేసులతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇష్టపడేవారికి ఈ వీకెండ్ మంచి టైమ్‌పాస్ కానుంది.
#MurderinGalicia (2026) | Spanish | series | 3 Episodes Streaming on Netflix from November 13… Audio: Tamil, Telugu & Hindi https://t.co/839vy8QdDz
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) November 9, 2026
