సజ్జనార్ తో సహా 21 మంది IPSలు బదిలీ

సజ్జనార్ తో సహా 21 మంది IPSలు బదిలీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ సైతం ఈ బదిలీల లిస్టులో ఉన్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనకు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా మహేష్ మురళీధర్ భగవత్ ను నియమించింది ప్రభుత్వం.

జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్య మిశ్రాకు డీజీపీ ఉమెన్ అండ్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అదే విధంగా డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ అదనపు బాధ్యతలు సౌమ్య మిశ్రాకే ఇచ్చారు. 

స్వాతి లక్రాకు జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు అప్పగించగా.. చారు సిన్హాకు అవినీతి నిరోధక శాఖ (ACB) డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు కూడా చారు సిన్హాకే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

తెలంగాణ ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్‌గా అనిల్ కుమార్ ను నియమించిన ప్రభుత్వం.. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్ కు బాధ్యతలు అప్పగించింది. 

ఇక సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌ అదనపు బాధ్యతలను  వై.నాగిరెడ్డికి అప్పగించింది ప్రభుత్వం. 

హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. అదే విధంగా తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీపీగా ఆకున్ సబర్వాల్ ను నియమించింది ప్రభుత్వం. 

ఇక మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ, ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి నియామకం జరిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా డి.జోయల్ డేవిస్‌ను నియమించింది ప్రభుత్వం. మొత్తం 21 మంది పోలీస్ అధికారుల బదిలీలు, పోస్టింగులతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.