నాగుల చవితి రోజు (2026 నవంబర్ 13) ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కాలసర్ప దోషాలు, రాహు కేతు దోషాలు, దేవతా సర్పాల శాపం నుంచి సులభంగా బయటపతారు.. నాగుల చవితి రోజు పాటించే విధి విధానాల వెనుక ఉన్న పౌరాణిక రహస్యాలు ఏంటో, ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో, వేదాంత రహస్యాలు ఏంటో, వైజ్ఞానిక రహస్యాలు ఏంటో తెలుసుకుందాం..!
మానవునికి శరీరం మొత్తంలో నవరంధ్రాలుంటాయి. ఈ 9 రంధ్రాలు.. శరీరంలోని నాడులు కలిసి వెన్నెముక ఉంటుంది. దీనినే వెన్నుపాము అంటారు. ఇది మానవ శక్తికి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతోంది.
మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు ఉంటూ కామ, క్రోధ, లోభ,మద, మోహ, మాత్సర్యాలు అనే విషాలను కక్కుతూ.. మనిషిలో ఉండే సత్వగుణ సంపత్తిని హరిస్తుంది.. అందుకే నాగుల చవితి రోజు పాము ( వెన్నుముకను)... పుట్టను ( మానవ శరీరాన్ని) ఆరాధించి పుట్టలో పాలు పోస్తే.. మనిషిలో ఉన్న విష సర్పం కూడా శ్వేతతత్వం పొందుతుందని.. అలాగే అందరి హృదయాల్లో కొలువై ఉండే.. శ్రీమహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారాలని కోరుకుంటూ చేసేదే నాగుల చవితి .. అందుకే ఈ రోజున ( నవంబర్ 13) పుట్టలో పాలు పోయడంలో ఆంతర్యమని పండితులు చెబుతారు.
కార్తీకమాసం శుక్ల పక్షం చవితి రోజున పుట్టలో పాలు పోయాలని చెప్పేందుకు ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. పాముకు పాలు పోస్తున్నాం.. అంటే పాలు అంటే సత్వగుణం... పాము అంటే బుసల కొడుతుంది మనలో రజోగుణం .. తమోగుణం ఉంటాయి. వీటి వలన కోపం వస్తుంది. ఈర్ష్య అసూయలు వస్తూ ఉంటాయి.అలాంటివి పోగొట్టుకోండని చెప్పటమే.. సత్వగుణం కలిగిన పాలు పుట్టలో పోయటంలో ఉన్న అంతరార్థం.మంచి గుణాలు పెంచుకోండి అని చెప్పటమే పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం.
►ALSO READ | కార్తీకమాసంలో పూజలు.. ఏ రోజు ఏ దేవుడికి పూజ.. ఎలాంటి ఫలితం వస్తుంది.. పూర్తి వివరాలు ఇవే..!
ఇక వేదాంత రహస్యం ఏంటంటే.. ప్రతి మనిషికి శరీరంలో కుండలిని శక్తి అని ఉంటుంది. గొప్ప గొప్ప యోగులు దాన్ని యాక్టివేట్ చేస్తారు. అప్పుడు ఆ కుండలిని శక్తి ఇక్కడ మాడు దగ్గరికి బ్రహ్మరంద్రం దగ్గరికి వస్తుంది.అప్పుడు వాళ్లు దేవుడితో సమానం అయిపోతారు. ఈ కుండలిని శక్తి ఏ మనిషి శరీరంలోనైనా పాము చుట్టలు మాదిరిగా చుట్టుకొని పడుకున్నట్టు ఉంటుంది. ఆ కుండలిని శక్తిని మనం లేపినప్పుడు ... చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న పాము ఒక్కసారిగా బుసగొట్టినట్టుగా ఆ కుండలిని శక్తి పైకి వస్తుంది. నీ శరీరంలో ఉన్న కుండలిని శక్తిని మేలుకొలుపు అని చెప్పటమే పాముకి పాలు పోయడంలో ఉన్న అంతరార్థమని పండితులు చెబుతున్నారు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
