హిందువులు.. కార్తీక శుద్ధ చవితి ( 2026 నవంబర్ 13) నాడు నాగుల చవితిని జరుపుకుంటాము. . నాగులచవితి రోజు సుబ్రమణ్యేశ్వర స్వామిని .. నాగేంధ్రస్వామిని పూజించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. నాగేంధ్రస్వామి కొలువై ఉంటే పుట్టలో ఆవుపాలు.. చలిమిడి.. చిమ్మిలి... బియ్యం నూక సమర్పిస్తారు. స్వామికి ఇవి సమర్పించేటప్పుడు చదవాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాం. . .
కార్తీక మాసం శివకేశవులకే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా విశేషమైనదని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీకమాసం శుద్ద చవితి రోజు ( 2026 నవంబర్ 13 ) నాగేంద్రుడు.. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఈరోజున నాగులచవితిగా పిలుస్తూ.. చలిమిడి, చిమ్మిలి, ఆవు పాలు, పూలు, పళ్లు తీసుకుని దగ్గర్లోని పుట్ట దగ్గరకు వెళ్లి.. నాగేంధ్రుడి దగ్గర దీపారాధన చేసి.. పూజ చేస్తారు. అనంతరం పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి నమస్కరించుకుంటారు. సిటీల్లో పుట్టలు ఉండవు కనుక... దేవాలయాల్లో నాగేంద్రుని ప్రతిమలకు సమర్పిస్తారు.
స్వామికి పైన తెలిపిన పదార్దాలను భక్తితో సమర్పించేటప్పుడు కొన్ని మంత్రాలను చదవాలి.
చలిమిడి సమర్పిస్తూ... చలిమిడితిని చల్లంగా చూడు
చిమ్మిలి ( బెల్లం మరియు నువ్వులు) సమర్పిస్తూ... చిమ్మిలి తిని సిరులు ఇమ్ము
నూకను ( బియ్యం నూక) సమర్పిస్తూ ....నూకను తీసుకొని మూకను కాపాడు
ఆవుపాలు సమర్పిస్తూ ...పాలు తాగి పవళించు
అని చదవుతూ స్వామికి సమర్పించాలి.
నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసినా.. నాగేంద్రుని ప్రతిమలకు సమర్పించినా.. జాతకంలో రాహు.. కేతు గ్రహాల దోషాలు ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. చాలా మంది భక్తులు ఇంట్లో పూజలు జరిపి పుట్టల్లో పాలు పోసి నాగ దేవతలను ఆరాధిస్తారు.
నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, విష్ణువు ఆదిశేషుగా మారతారని చెబుతారు. అందుకనే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు. సంతానం లేని వారు నాగదేవుని ఆరాధిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి, దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది.
►ALSO READ | ఆధ్యాత్మికం: పుట్టలో పాలు ఎందుకు పోయాలి.. వేదాంత రహస్యం.. ప్రకృతి రహస్యం ఇదే..!
పూజ కొరకు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం, వెండితో చేసిన ఐదు నాగపడగలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి.
పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ .. . రాహు కేతు దోషాలు కాలసర్ప దోషాలు, దేవతా సర్పాల శాపాలు ఉన్నవాళ్లు తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి. ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు అనంత వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబ, శంఖపాల, ధాత్ర, రాష్ట్ర, తక్షక, కాళీయ. ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి.
ఇలా పుట్టకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంతమందికి జాతక రీత్యా రాహు కేతు దోషాలు ఉంటాయి. అలాంటి వాళ్లు మాత్రం జంటనాగుల విగ్రహాల దగ్గరికి కూడా వెళ్లి పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
చివరగా అక్షితలు చేతిలోపట్టుకుని మనస్సులో దాగిఉన్న కోరికలను నాగాదేవతకు విన్నవించుకుంటూ పుట్టచుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగ ,ఆడవారు మోకాలి పై వంగి , గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి.
సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరునోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
