దుబాయ్ ప్రమాదం మృతుల్లో భారతీయులు.. డీఎన్ ఏ పరీక్షలతో గుర్తింపుచర్యలు: భారత కాన్సులేట్ ప్రకటన

దుబాయ్ ప్రమాదం మృతుల్లో భారతీయులు.. డీఎన్ ఏ పరీక్షలతో గుర్తింపుచర్యలు: భారత కాన్సులేట్ ప్రకటన

యూఏఈలోని ఫుజైరా (Fujairah)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.యూఏఈలోని ఫుజైరా ఎమిరేట్ ప్రవేశ ద్వారం దగ్గర  షేక్ ఖలీఫా బిన్ జాయెద్ హైవైపై అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి ముందు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న ఇతర వాహనాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు.30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు ధృవీకరించారు. అయితే మృతుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులు డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 18 కార్లు, 5 ట్రక్కులు సహా 23 వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.