యూరప్లోని అమెరికా బేస్లే టార్గెట్.. అగ్రరాజ్యానికి ఇరాన్ వార్నింగ్

యూరప్లోని అమెరికా బేస్లే టార్గెట్.. అగ్రరాజ్యానికి ఇరాన్ వార్నింగ్
  •  తొమ్మిది దేశాల్లోని సైనిక స్థావరాలకు తీవ్ర ముప్పు

న్యూఢిల్లీ/టెహ్రాన్: అమెరికా తీరుపై ఇరాన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంపై అమెరికా గగనతల దాడులకు పాల్పడితే.. యూరప్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మేజర్ జనరల్ మొహ్సన్ రెజాయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిడిల్​ఈస్ట్​లో ఇప్పటికే దాడులు చేసిన ఇరాన్.. ఇప్పుడు ఖండాంతర యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా టార్గెట్ జాబితాలో చేర్చడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

బ్రిటన్, జర్మనీ, ఇటలీలే ప్రధాన లక్ష్యాలు

ఇరాన్ హెచ్చరికలను పశ్చిమ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వైమానిక స్థావరం నుంచి అమెరికా రీఫ్యూయెలింగ్ విమానాలను ఇప్పటికే హుటాహుటిన తరలించినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. నాటో కూటమిలో భాగంగా యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోహరించిన అమెరికన్ సైనికులు, యుద్ధ విమానాలే ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నిర్ణయం వైపు నడిపిస్తున్నాయి. 

బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎఫ్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్డ్, మైల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్, లాకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీత్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, జర్మనీలోని రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెయిన్, స్పాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాహ్లెం, ఇటలీలోని అవియానో ఎయిర్ బేస్, సిగోనెల్లా స్థావరాలు ఇరాన్ రాడార్​లో ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇస్ట్రేస్, గ్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సోడా బే, సైప్రస్, రొమేనియా, అల్బేనియా, పోర్చుగల్ దేశాల్లోని అమెరికా, నాటో స్థావరాలు కూడా తమ టార్గెట్లేనని ఇరాన్ అనుబంధ పత్రిక ‘హమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షహ్రీ’ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది. తటస్థ దేశాలనైనా సరే వెనుకాడబోమని ఇరాన్ స్పష్టం చేస్తుండడంతో యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి.