చార్లెస్ శోభరాజ్ గర్ల్ ఫ్రెండ్కు భోజనం తీసుకెళ్లాను: బిలాంగింగ్లో సోనియా గాంధీ

చార్లెస్ శోభరాజ్ గర్ల్ ఫ్రెండ్కు  భోజనం తీసుకెళ్లాను: బిలాంగింగ్లో సోనియా గాంధీ
  •  అత్తమ్మ తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమెకు కూడా తీసుకురమ్మని చెప్పారు

    
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీహార్ జైలులో గడిపిన వారం రోజులు(1978 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో).. ఆమెను కలిసేందుకు వెళ్లడం, అక్కడ ఎదురైన అనుభవాలను సోనియాగాంధీ తన బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకంలో పంచుకున్నారు. ఈ విశేషాలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 1978 క్రిస్మస్ రోజున ఇందిరాగాంధీ కోసం స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని తీహార్ జైలుకు తీసుకెళ్లానని సోనియా తన పుస్తకంలో చెప్పారు. 

ఆ సమయంలో అత్తమ్మ ఒక ప్రత్యేక కోరిక కోరారని, తనను కాపలా కాస్తున్న ముగ్గురు మహిళా గార్డులతోపాటు, అదే ఆవరణలో ఉన్న ఒక విదేశీ ఖైదీకి కూడా సరిపడా భోజనం తేవాలని సూచించారని పేర్కొన్నారు. ఆ విదేశీయురాలే అంతర్జాతీయ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ గర్ల్​ఫ్రెండ్ అన్నారు. తొలుత హ్యామ్(పంది మాంసం) వంటకం తీసుకెళ్లగా, ఆ అమ్మాయి దాన్ని తినదని ఇందిరాగాంధీ చెప్పడంతో.. వెంటనే మెనూ మార్చి రోస్ట్ చికెన్ సిద్ధం చేసి పంపినట్లు చెప్పారు. ఆ యువతి కెనడాకు చెందిన మేరీ -ఆండ్రీ లెక్లెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించానన్నారు. ఇందిరాగాంధీ జైలు గది అత్యంత శీతల వాతావరణంలో, ఇనుప కమ్మీలతో, కనీస సదుపాయాలు లేకుండా ఉండటం కంటతడి పెట్టించిందని గుర్తు చేసుకున్నారు. 

జైలు అధికారులు అనుమతిస్తే రాహుల్, ప్రియాంకలను కూడా అక్కడికి తీసుకెళ్లడంతో అత్తమ్మ ఎంతో ఆనందించారన్నారు. ‘ఇందిరాగాంధీ కొన్నిసార్లు పుస్తకంలో లేదా టిఫిన్ బుట్టలో చేతితో రాసిన చిట్టీలను ఉంచేవారు.. ఒకరు తనకు పంపిన టెలిగ్రామ్ గురించి అందులో ఇలా ఉంది: నేను జైలు గదిలో ఇనుప కమ్మీలను లెక్కించమని అడిగిన.. ఆ టెలిగ్రామ్ మీకు గుర్తుందా? సరే, నేను లెక్కించాను!.. మొత్తం 193 కమ్మీలు, 11 తాళాలు ఉన్నాయి’ అని అత్తమ్మ సరదాగా రాసి పంపారని సోనియా పేర్కొన్నారు. జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ ధిక్కరణ ఆరోపణలపై ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన ఉదంతం, ఆ తర్వాత భారత రాజకీయాల్లో ఊహించని మలుపులకు దారితీసింది.