పంజాబ్ ఎన్నికల్లో.. 31 మందితో ఆప్ రెండో లిస్ట్ విడుదల

 పంజాబ్ ఎన్నికల్లో..  31 మందితో ఆప్  రెండో లిస్ట్  విడుదల

 న్యూఢిల్లీ: 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం 31 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుడియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించింది. దీంతో ఇప్పటి వరకు ఆప్ మొత్తం 117 నియోజకవర్గాలకుగాను 71 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ కుమార్ గుప్తా ఈ జాబితాను విడుదల చేశారు. 

ఇందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో పాటు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన 21 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇంకా 46 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. 2022 ఎన్నికల్లో 92 స్థానాలు గెలుచుకుని భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్.. 2027లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది.