ఘట్ కేసర్, వెలుగు : పోచారం ఐటీ కారిడార్ పీఎస్పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఐ నాగేశ్వర్రావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యమ్నంపేట్లో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం పేరుతో ఒక్కో బిల్డర్ను రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కోరినట్లు బిల్డర్లు ఆరోపించారు.
కొందరు బిల్డర్లతో పాటు హాస్టల్నిర్వాహకులను పీఎస్కు పిలిపించిన ఎస్ఐ ...అక్కడి నుంచే మరికొందరికి ఫోన్చేశారు. దీనికి సంబంధించి డబ్బులు ఇవ్వాలని అడుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.
‘ ఈ నెల10వ తేదీలోగా డబ్బులను సర్దుబాటు చేయాలి. సీపీ మేడం ప్రోగ్రామ్ ఉంది’ అని ఆయన బిల్డర్లపై ఒత్తిడి చేయడం అందులో ఉంది.
