బంగారం ధరకు మళ్లీ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఒక్కరోజే రూ.2వేల200 పతనం

బంగారం ధరకు మళ్లీ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  ఒక్కరోజే రూ.2వేల200 పతనం

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. గురువారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,200 తగ్గి రూ.1,43,400కు చేరింది. బుధవారం ఈ ధర రూ.1,45,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం, దేశీయంగా కొనుగోళ్ల ఆసక్తి మందగించడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. మరోవైపు వెండి ధర మారలేదు. కిలో ధర రూ.1,87,500 వద్ద స్థిరపడింది. 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర 1 శాతం తగ్గి 3,950 డాలర్ల దిగువకు పడిపోయింది. బలపడిన అమెరికా డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పసిడిపై ఒత్తిడి పెంచుతోంది. డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచీ 103 స్థాయిని దాటితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ధరల కదలికలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.