న్యూయార్క్లో కుప్పకూలిన భవనం .. 8 మంది మృతి

న్యూయార్క్లో కుప్పకూలిన భవనం .. 8 మంది మృతి

న్యూయార్క్: అమెరికాలోని బ్రూక్లిన్‌‌‌‌‌‌‌‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో 8 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంత మందిని కాపాడగా, మరికొంత మందిని రక్షించేందుకు పోలీసు జాగిలాల సహాయంతో చర్యలు చేపట్టారు. దాదాపు 250 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. 

బుధవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారని మేయర్ జోహ్రాన్ మమ్దానీ తెలిపారు. కాగా, కుప్పకూలిన భవనం 1930లో నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. కూలిన భవనం పక్కన ఖాళీ స్థలంలో కొత్త భవన నిర్మాణానికి తవ్వకాలు జరపడంతో ఈ పురాతన భవనం కూలిపోయినట్లు 
భావిస్తున్నారు.