చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి : మంత్రి జూపల్లి

చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి : మంత్రి జూపల్లి
  •     సుందరీకరణ పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన

కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.6.5 కోట్లతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చుక్కాయిపల్లి చెరువును కొల్లాపూర్కు ప్రత్యేక ఆకర్షణగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 

అనంతరం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నూతన చైర్పర్సన్ పసుపుల షమీమ్, వైస్ చైర్మన్ పసుపుల  నరసింహ, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మొలచింతలపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన 13 ఏళ్ల బాలిక గోదా పల్లవి మృతదేహానికి మంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.